News

మహా కుంభ్‌లో ఆర్మీ సిబ్బంది, రిటైర్డ్ సైనికుల కోసం ప్రత్యేక టెంట్స్

282views

మహా కుంభ మేళా కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఈ ఏడాది ప్రయాగ్ రాజ్ లో జరగనున్న మహా కుంభ మేళా కోసం ఇప్పటికే ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ సంఖ్యలో భక్తులు, సాధువులు ఈ మేళాకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే మహా కుంభ లో పాల్గొనే ఆర్మీ సిబ్బంది, రిటైర్డ్ సైనికుల కోసం ప్రత్యేక టెంట్ కాలనీ నిర్మింస్తున్నారు. ఇక్కడ బస చేయాలనుకునే ఆర్మీ సిబ్బంది, మాజీ ఆర్మీ అధికారులు ఆన్‌లైన్ లో బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది

మహా కుంభమేళా జనవరి 13, 2025 సోమవారం పుష్య మాసం పూర్ణిమ రోజున ప్రారంభంకానుంది. ఇప్పటికే ఈ మహా కుంభ మేళాలో పాల్గొనేందుకు అఖారాలు, కల్పవాసులు రావడం ప్రారంభించారు. మహా కుంభానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి మహాకుంభలో పాల్గొనలానుకునే దేశవ్యాప్తంగా ఉన్న సైనికులు, మాజీ సైనికుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మహాకుంభ సందర్భంగా త్రివేణీ సంగమంలో స్నానం చేసే సైనికులు, మాజీ సైనికులు బస చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సైనికులు, మాజీ సైనికుల బస కోసం జాతర ప్రాంతంలో టెంట్లు వేస్తున్నారు.

మహాకుంభంలో సంగమ స్నానం చేయడానికి దేశంలోని ఏ మూల నుంచి అయినా సైనికులు, మాజీ సైనికులు పాల్గొనవచ్చు అని అంచనా వేస్తున్నారు. అందుకనే ఈ స్పెషల్ ఏర్పాట్లు వేస్తున్నారు. అయితే టెంట్‌లో ఉండేందుకు సైనికులు, మాజీ సైనికులు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మహాకుంభానికి వచ్చే సైనికులు, మాజీ సైనికులకు సంగం, కోట లోపల బస చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సంగంలో టెంట్ కాలనీ, కోటలో గెస్ట్ హౌస్ ఉంటుంది.