
విశ్వహిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో కేసరపల్లి గ్రామం గన్నవరం లో నిర్వహిస్తున్న హైందవ శంఖారావం బహిరంగ సభ విజయవంతం చేయాలని కోరుతూ కాకినాడ జిల్లా, రాయవరం మండలం సోమేశ్వరం గ్రామం నుండి శ్రీ అడబాల దుర్గాప్రసాద్ స్వామీజీ పాదయాత్ర చేస్తూ గురువారం ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలంలోని నారాయణపురం గ్రామం జాతీయ రహదారి వద్ద ఉన్న శ్రీ దుర్గమ్మ వారి ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ మన దేశం హిందూదేశం మన భారతదేశం గొప్పతనం పేరు ప్రతిష్ట మన సాంప్రదాయాలు మన సనాతన ధర్మం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది అని అన్నారు. మానవజాతి ఎన్నో వేల సంవత్సరముల నుండి ప్రధానముగా వస్తున్న, ఆచరిస్తున్న మన మతం హిందూమతం మన దేశానికి మూలాధారం దేవాలయాలు మన పూర్వీకులు నిర్మించిన, సంపాదించి ఇచ్చిన దేవాలయాల ఆస్తులు, భూములు, ధనం, బంగారం, వెండి, వజ్ర వైడూర్యములు దేవుళ్ళకి అలంకరణ నిమిత్తం ఎన్నో విలువైన వస్తువులు, సామాగ్రిని దేవాలయ సంపదను దేవాలయాలను కాపాడుకోవాల్సిన అవసరం మనందరి బాధ్యత అని అన్నారు. అలాగే భారతదేశం గొప్పతనం కాపాడే ప్రతి హిందూ ధర్మ రక్షకులు వారి ఆస్తులని సనాతన ధర్మాన్ని కాపాడాలని కోరుకుంటూ జనవరి 5వ తేదీన గన్నవరంలో జరగబోయే హైందవ శంఖారావం కార్యక్రమం విజయవంతం చేయాలని ఆయన పాదయాత్ర చేయడం ప్రారంభించినట్టు తెలియజేశారు. చిలకంటి జయరాజు, నూకల రోహిత్, జెల్ల రమేష్, రాజాని సతీష్, నూకల పవన, బొడ్డేపల్లి అప్పారావు, గోపి తదితర హిందూ బంధువులు స్వామీజీని సత్కరించి వారి ఆశీస్సులు తీసుకున్నారు..





