
చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రం కాణిపాకంలో ఆలయ అధికారులు భక్తుల కోసం వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. క్యూలైన్లలోని భక్తులకు బాదంపాలు, బిస్కెట్లు పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో క్యూలైన్లలోని భక్తులకు బిస్కెట్లు , బాదంపాలు పంపిణీ కార్యక్రమాన్ని ఆలయ ఈవో పెంచల కిషోర్ ప్రారంభించారు. ఇకపై ప్రతినిత్యం ఈ కార్యక్రమం కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నారు. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు దర్శనం కోసం వచ్చి క్యూ లైన్‌లలో నిరీక్షిస్తున్న వారి సౌకర్యార్థం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఇది భక్తులకు మంచి శుభవార్త.తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు స్వామివారిని దర్శించుకోడానికి తరలివస్తున్నారని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామని ఆలయ ఈవో పెంచల కిషోర్ వెల్లడించారు.





