News

దేవాలయాల పరిరక్షణ కోసం హైందవ శంఖారావం

303views

జనవరి5 వతేదీన విజయవాడ జరిగే హైందవ శంఖారావం రాజకీయపార్టీలకు అతీతంగా దేవాలయాల పరిరక్షణ కోసం దేశవ్యాప్త ఉద్యమంలొ భాగంగానే ఇక్కడ హైందవ శఖారావం విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతుదని ఆధోని ఎంఎల్ఏ పార్థసారధి తెలిపారు .విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ రెండులక్షల మందితో హైందవ శంఖారావం జరుగుతుందని ఇందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరిస్తున్నాయన్నారు. ధర్మాచార్యుల ఆధ్వర్యంలో దేవాలయాలు అభివ్రుద్ది జరగాలని ఇప్పటికే చాలా దేవాలయాలు ఆస్తులు ఆక్రమణలో ఉన్నాయని వాటిని స్వాధీనం చేసుకుని దేవాలయాల అభివ్రుద్దికి నడుం బిగించాల్సిన అవసరం ఉందన్నారు. దేవాలయాల మాన్యాలను రక్షించాల్సిన అవసరం ఉందన్నారు. విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో హైందవ శంఖారావానికి వచ్చే వారికి ఏర్పాట్లు జరగబోతున్నాయన్నారు.ఈ కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీలు, సాధు సంత్ లు కూడా వస్తారు..ఆలయాలకు స్వయం ప్రతిపత్తి కావాలనేది లక్ష్యమని అన్నారు.