
251views
గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణ పరిధిలోని బాపూజీ విద్యాలయంలో ధనుర్మాస మహోత్సవాలలో భాగంగా 11వ పాశురాన్ని గురువారం భక్తులకు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వివరించారు. ఈ సందర్భంగా జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నిర్వాహకులు పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ.. ఈ మహోత్సవాలలో భాగంగా జగ్గయ్యపేట, గుంటూరు, మంగళగిరి ప్రాంతాల నుంచి సుమారు 400 మంది భక్తులు గోదా అమ్మవారికి సారె సమర్పించారని తెలిపారు. అమ్మవారికి అష్టోత్తరం, తీర్థప్రసాద గోష్టి, మంగళాశాసనాలతో కార్యక్రమం వైభవంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం హయగ్రీవ పూజ నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారని చెప్పారు.




