
407views
తిరుమల తిరుపతి దేవస్ధాన ధర్మకర్తల మండలి సభ్యులు, బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ తెనాలి పట్టణంలో పర్యటించారు. ప్రసిద్ది చెందిన వైకుంఠపురం దేవస్దానంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారిని ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భాను ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ లో దేవాలయాలకు మంచి రోజులు వచ్చాయన్నారు. . గత ప్రభుత్వంలో టీటీడీ నిధులను దారి మళ్లించే ప్రయత్నం చేశారని రాష్ట్రంలో ఏ దేవాలయం నుంచి ఒక రూపాయి కూడా ప్రభుత్వా ఆస్తులకు గాని కార్యక్రమాలకు గాని ఉపయోగించకూడదని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. 5వ తేదీన విజయవాడలో జరిగే హైందవ శంఖారావం సభను జయప్రదం చేయాలని కోరారు.





