News

మాజీ ప్రధాని మన్మోహన్ మృతిపై ఆరెస్సెస్ సంతాపం

260views

మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతిపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించింది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్, సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంతో యావత్ దేశం తీవ్ర విచారం వ్యక్తం చేస్తోందన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మన్మోహన్ సింగ్ కుటుంబానికి, వారి ఆప్తులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తోందని పేర్కొన్నారు. అత్యంత నిరాడంబర నేపథ్యం నుంచి వచ్చినా, దేశంలో అత్యున్నత పదవిని అలంకరించారని అన్నారు. మన్మోహన్ సింగ్ దేశానికి అందించిన సహకారాన్ని ప్రజలు ఎల్లప్పటికీ గుర్తుంచుకుంటారని, వారి ఆత్మకు సద్గతులు కలగాలని ఈశ్వరుడ్ని ప్రార్థిస్తున్నట్లు సంఘ్ పేర్కొంది.