News

పశువుల తరలింపును అడ్డుకున్న హిందూ జాగరణ సమితి

307views

చిత్తూరు జిల్లా పుంగనూరులో కబేళాకు తరలిస్తున్న పశువులను హిందూ జాగరణ సమితి సభ్యులు అడ్డుకున్నారు. ఈ విషయమై సీఐ శ్రీనివాసులు మాట్లాడుతూ.. హైదరాబాద్ నుంచి త్రివేండ్రంకు తరలిస్తున్న 22 పశువులను హిందూ జాగరణ సమితి సభ్యులు అడ్డుకొని పోలీసులకు అప్పగించడంతో పశువులను స్థానిక బందల దొడ్డికి తరలించినట్లు సీఐ పేర్కొన్నారు.

హిందూ జాగరణ సమితి సభ్యులు మాట్లాడుతూ.. ఆవులను అక్రమంగా తరలిస్తున్న వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అధిక లోడుతో ట్రక్కులో అధిక సంఖ్యలో ఆవులను బంధించి తరలిస్తున్న వారిపై కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రతి నిత్యం కొన్ని వందల ఆవులు, పశువులు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ఇతర రాష్ట్రా లకు యధేచ్ఛగా తరలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గోరక్ష చట్టం ప్రకారం ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం పశువుల అక్రమ తరలింపుపై ప్రత్యేక దృష్టి పెట్టి ఆవులను పశువులను కాపాడాలని కోరారు. అన్ని జిల్లాల పోలీసు అధికారులు గోరక్షణకై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గోవూలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. లేకపోతే ఆందోళన చేపట్టక తప్పదని హెచ్చరించారు