
రళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయానికి మండల-మకరవిళక్కు సీజనులో లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. ఆ స్వామి సేవలో తరిస్తారు. భారీగా తరలివచ్చే భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు దేవస్థానం బోర్డు, ప్రభుత్వ యంత్రాంగం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా నూతన సాంకేతికతనూ వినియోగిస్తున్నారు. భక్తులకు ఉపయోగపడే ‘ఏఐ చాట్‌బాట్’ను అందుబాటులోకి తీసుకువచ్చారు. దీనిపేరే ‘స్వామి’ చాట్‌బాట్.
సవాళ్లకు తగ్గట్టుగా..
శబరిమల క్షేత్రంలో ప్రతి సంవత్సరం రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో.. పలు సవాళ్లు కూడా ఎదురవుతున్నాయి. ముఖ్యంగా భారీ సంఖ్యలో తరలివచ్చే భక్తుల రద్దీ నియంత్రణ ఎంతో ముఖ్యం. భక్తుల వసతి, భద్రత, క్యూల నిర్వహణ కష్టమైన పని. మరోవైపు ఆలయ సమయాలు, మార్గాల వివరాలు, యాత్రికుల సమూహాలకు సంబంధించిన కచ్చితమైన సమాచారం అందుబాటులో లేక భక్తులు గందరగోళానికి గురవుతుంటారు. ఇక వాతావరణ అప్‌డేట్లు లేకపోవడంతో.. ముఖ్యంగా వర్షాకాలంలో, ట్రెక్కింగ్ సమయంలో భక్తులు తరచూ ప్రమాదాలకు గురవుతుంటారు. ఆహార పదార్థాల ధరలు, బస్సుల సమయాలు తదితర అంశాలపై స్పష్టత లేకపోవడం. దీనికి తోడు భాషా పరమైన అవరోధాలు ఎదురవుతుండటంతో.. భక్తులకు సమాచారం అందించడం అత్యవసర పరిస్థితుల్లో కష్టంగా ఉంటుంది. ఈ సవాళ్లను అధిగమించేందుకు మెరుగైన కమ్యూనికేషన్ సిస్టమ్ అవసరమని అధికారులు భావించారు.
శబరిమల క్షేత్రానికి వచ్చే యాత్రికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు పతనంతిట్ట జిల్లా కలెక్టర్ ప్రేమ్ కృష్ణన్ నేతృత్వంలో ఓ వినూత్న పరిష్కారాన్ని రూపొందించారు. వాట్సాప్ ఆధారిత చాట్‌బాట్‌ను అభివృద్ధి చేశారు. ఆలయానికి సంబంధించిన పూర్తి సమాచారం, దర్శన సమయాలు, వాతావరణ పరిస్థితులు, ఆహార లభ్యత, భక్తుల సమూహాలు వంటి ముఖ్యమైన అంశాలపై రియల్ టైమ్ అప్‌డేట్స్ ఇవ్వడమే ఈ చాట్‌బాట్ లక్ష్యం. యూజర్ ఫ్రెండ్లీగా ఉండే ఈ చాట్‌బాట్.. భక్తుల సౌకర్యార్థం అనేక భాషల్లో సేవలు అందిస్తోంది. కచ్చితమైన, సమయానుకూల సమాచారాన్ని అందుబాటులో ఉంచేలా.. భక్తులకు, ఆలయానికి మధ్య ఇదో వారధిలా పనిచేస్తోంది. లక్షలాది మంది భక్తులకు ఉత్తమమైన యాత్ర అనుభవాన్ని అందించడంలో ఇది ఉపయోగపడటమే కాకుండా.. జవాబుదారీతనాన్ని కూడా పెంపొందిస్తోంది.
అందుకే ఆ పేరు..
ఈ చాట్‌బాట్‌కు ‘స్వామి’ అని పేరు పెట్టారు. ప్రతి భక్తుడిని గౌరవంగా ‘స్వామి’ అని పిలిచే ఈ క్షేత్రం ఆధ్యాత్మికతను ప్రతిబింబించే విధంగా ఈ పేరు పెట్టినట్లు అధికారులు వివరించారు. ఇది భక్తులతో ప్రత్యక్ష సంబంధాలను ఏర్పర్చుతుందని చెప్పారు.
చాట్‌బాట్ పీచర్స్ ఇవే..
ఐదు వారాల్లో.. 1.5 లక్షల సబ్‌స్క్రిప్లన్లు..
‘స్వామి’ వాట్సాప్ చాట్‌బాట్ సేవలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ నవంబర్ 13న ఆవిష్కరించారు. భక్తులందరికీ చేరేలా.. మీడియా, ఎఫ్‌ఎం రేడియో, సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం కల్పించారు. దీంతో యాత్రికుల నుంచి విశేష స్పందన లభించింది. ఐదు వారాల్లోనే 1.5 లక్షల సబ్‌స్క్రిప్షన్ల మైలురాయికి ఇది చేరుకుంది. ప్రతి పది మంది భక్తుల్లో 9 మంది దీని సేవలను వినియోగించుకుంటున్నారు.
ఈ చాట్‌బాట్ ఇప్పటి వరకూ దాదాపు మూడు వేల ఎమర్జెన్సీ కాల్స్‌ను సమర్థంగా నిర్వహించింది. మెడికల్ ఎమర్జెన్సీ, ప్రమాదాలు, వ్యక్తులు తప్పిపోవడం తదితర అత్యవసర పరిస్థితుల్లో .. కేవలం ఐదు నిమిషాల్లోపే స్పందించినట్లు అధికారులు తెలిపారు.





