
గన్నవరం సమీపంలోని కేసరపల్లిలో జనవరి 5న నిర్వహించనున్న హైందవ శంఖారావం మహాసభలకు రాజకీయ పార్టీలు, కులాలకు అతీతంగా తరలివచ్చి జయప్రదం చేయాలని ప్రముఖ వాస్తు సిద్ధాంతి మామిడి సత్యనారాయణ కోరారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో కార్యక్రమ గోడ పత్రి కను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్నా.. ఇప్పటికీ హిందువుల మనో భావాలు, దేవాలయాలకు, విశ్వాసాలకు స్వేచ్ఛ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో సెక్యులర్ ముసుగులో కొన్ని శక్తులు సనాతన ధర్మంపై, హిందూ దేవాలయాలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా దాడు లకు ప్రేరేపిస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని విమర్శించారు. హిందూదేవాలయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని, భూములను ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వాడుతున్నాయని మండిపడ్డారు. హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కలిగించే వరకు హిందువులంతా పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సభ్యులు బాల వెంకటేశ్వర్లు, కె. రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు





