News

మజ్లిస్‌ ఎంపీ ఒవైసీకి యూపీ కోర్టు నోటీసులు..

325views

మజ్లిస్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఎంపీగా ప్రమాణం చేసిన సమయంలో జై పాలస్తీనా అంటూ నినాదాలు చేసినందుకు ఒవైసీ న్యాయపరమైన వివాదంలో చిక్కుకున్నారు. ఉత్తరప్రదేశ్‌ లోని బరేలి కోర్టు ఆయనకు నోటీసులు జారీ చేసింది. జనవరి ఏడవ తేదీన తమ ముందు హాజరుకావాలని కోర్టు నోటీసులు జారీ చేసింది. బరేలి జిల్లా కోర్టు నుంచి ఒవైసీకి నోటీసులు అందడం సంచలనం రేపుతోంది. ప్రమాణ స్వీకారం తరువాత ఒవైసీ జై భీమ్‌ , జై తెలంగాణ , జై పాలస్తీనా అంటూ నినాదాలు చేశారు. చాలా రోజుల నుంచి మజ్లిస్‌ అధినేతపై ఈ వివాదం నడుస్తోంది. ఈ వ్యాఖ్యలపై హిందూ సంఘాలతో పాటు బీజేపీ నేతలు ఒవైసీని తీవ్రంగా విమర్శించారు. అయితే ఈ వ్యాఖ్యలను పూర్తిగా సమర్ధించుకున్నారు ఒవైసీ.. తన వ్యాఖ్యలు రాజ్యాంగం విరుద్దం కాదని అంటున్నారు.

అయితే ఓవైసీ వ్యాఖ్యలపై బరేలికి చెందిన వీరేంద్ర గుప్తా అనే వ్యక్తి ఒవైసీకి వ్యతిరేకంగా పిటిషన్‌ దాఖలు చేశారు. ఒవైసీపై బరేలి జిల్లా కోర్టు గత జులైలో వీరేంద్ర గుప్తా పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారించిన న్యాయస్థానం ఆయనకు నోటీసులు జారీ చేసింది. జనవరి 7వ తేదీనే బరేలి జిల్లా కోర్టులో కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీ హాజరుకావాల్సి ఉంది. కులగణనపై రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలు ప్రజలను విభజించే తీరుగా ఉన్నాయని వీరేంద్రగుప్తా పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో రాహుల్‌కు కోర్టు నోటీసులు జారీ చేసింది.