News

తిరుపతిలో అపచారం.. అన్నమయ్య విగ్రహానికి శాంతాక్లాజ్ టోపీ !

293views

తెలుగు ప్రజలు ఎంతో పవిత్రమైన ప్రాంతంగా పరిగణించే తిరుపతిలో అపచారం జరిగింది. తొలి తెలుగు వాగ్గేయకారుడు, పదకవితా పితామహుడు తాళ్ళపాక అన్నమయ్య విగ్రహానికి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు శాంతాక్లాజ్ టోపీ పెట్టారు. అన్నమయ్యను ఇలా అవమానించడంపై రాష్ట్రంలో ఆందోళలు మొదలయ్యాయి. ముఖ్యంగా హిందూ సంఘాలు ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాయి.

శ్రీ వేంకటేశ్వర స్వామికి ప్రియ భక్తుడు, పదకవితా పితామహుడిని కించ పరిచేలా దుండగులు వ్యవహరించడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్రైస్తవుల అత్యుత్సాహం పనికిరాదని హిందూ సంఘాలు హెచ్చరికలు జారీ చేశాయి. ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఘటనపై పోలీసులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఇలాంటి చర్యలకు పాల్పడటం బాధాకరమని హిందూ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

విషయం తెలిసిన భజరంగ్ దళ్ తో పాటు ఇతర హిందూ సంఘాల నాయకులు కూడా ఆ ప్రాంతానికి చేరుకుని నిరసనకు దిగాయి. హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాయి. న్యాయం కావాలని కోరుతూ రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.