
విదేశాలకు వెళ్లే భారతీయులు సాంస్కృతిక రాయబారులని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ అభివర్ణించారు. వారిని సాంస్కృతిక రాయబారులుగానే చూడాలి కానీ… అవసరాల కోసం డబ్బులు సంపాదించుకునే వారిగా అస్సలు చూడొద్దన్నారు.ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం మొత్తానికి భారతీయ నాయకత్వం అత్యావశ్యకమని నొక్కి చెప్పారు. పూణెలో జరిగిన పుస్తక ప్రదర్శన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆరెస్సెస్ @100, హిందుత్వంపై ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా నేషనల్ బుక్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ మిలింద్ మరాఠే పుస్తకాన్ని బహుమతిగా అందజేసి సునీల్ అంబేకర్ కి స్వాగతం పలికారు.
భారతీయుల తెలివితేటలు, సామర్థ్యంపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కి పూర్వి విశ్వాసం వుందని సునీల్ అంబేకర్ ప్రకటించారు. అందుకే రానున్న కాలంలో సంఘ పరివర్తనలో ఆరెస్సెస్ మాత్రమే కాకుండా సమాజం కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అలాగే సంఘ శతాబ్ది సందర్భంగా పంచ పరివర్తన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. సమాజం మొత్తం సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. సంఘ శతాబ్ది సందర్భంగా దేశ వ్యాప్తంగా సంఘ శాఖలను విస్తరించడానికి, ద్రుఢీకరణ కోసం, పౌరులకు దగ్గరయ్యేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. సమాజంలోని అన్ని సంస్థలను, అన్ని రకాల వ్యక్తులను కలుస్తూ… సజ్జన శక్తిని సమాజ సంఘటనలో భాగస్వాములను చేస్తున్నామని తెలిపారు.





