News

మహాకుంభ మేళాకు 14 ప్రత్యేక రైళ్లు

329views

మహాకుంభ మేళా రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ముఖ్య నగరాల నుంచి 14 ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. అత్యధికంగా హైదరాబాద్‌ నుంచి 8 రైళ్లను నడుపుతుండగా, గుంటూరు నుంచి 4, నాందేడ్‌ నుంచి 2 ప్రత్యేక రైళ్లు నడుస్తాయని సీపీఆర్వో శ్రీధర్‌ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. జనవరి 19 నుంచి 27 వరకు ఈ రైళ్లు ప్రయాణికులకు అందుబాట్లో ఉంటాయని పేర్కొన్నారు. కుంభమేళా జరిగే ప్రాంతాలైన అజాంఘర్‌, గయా, పాట్నా వెళ్లేందుకు ప్రయాణికులు ఈ ప్రత్యేక రైళ్లలో రిజర్వేషన్‌ చేసుకోవచ్చని సూచించారు.