News

మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో

296views

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో ప్రయోగానికి సిద్ధమైంది. డిసెంబర్‌ 30న రాత్రి 9.30 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ-60 ప్రయోగాన్ని నిర్వహించనుంది. సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి దీనిని ప్రయోగించనుంది. ఈ ప్రయోగం ద్వారా 400 కిలోల బరువు కలిగిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన స్పాడెక్స్‌ అనే జంట ఉపగ్రహాలను రోదసిలోకి ప్రవేశపెట్టనుంది.

పీసీఎస్‌ఎల్‌వీ సీ-59 రాకెట్‌ను ఈ నెల 5న ఇస్రో విజయవంతంగా నిర్వహించింది. యురోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీకి చెందిన ప్రోబా-3 ఉపగ్రహాలను నిర్ధేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగం చేపట్టిన రోజుల వ్యవధిలోనే పీఎస్‌ఎల్‌వీ సీ-60 ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది.