
కేరళ జన్మభూమి దిన పత్రిక సంపాదకులు శ్రీకుమార్ పోప్‌ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఋగ్వేదాన్ని పోప్‌కి బహూకరించారు. శ్రీ నారాయణ ధర్మసంఘం ట్రస్ట్ నిర్వహించిన సర్వమత సదస్సు శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నవంబర్ మాసంలో వాటికన్‌లో జరిగింది. పోప్‌కి ఋగ్వేదాన్ని బహూకరించాలని స్వామి సత్యానంద సరస్వతీ సూచించారని, ఋగ్వేదాన్ని బహుమతిగా ఇవ్వడం ద్వారా హిందూ ధర్మాన్ని మరో సారి విశ్వవ్యాపితం చేయాలని భావించారని పేర్కొన్నారు.
వేదాలు హిందూ ఆలోచనలకు, తత్వ శాస్త్రానికి మూలస్తంభమని స్వామీజీ తరుచూ చెప్పేవారని ఈ సందర్భంగా శ్రీకుమార్ గుర్తు చేసుకున్నారు. గతంలో హ్యూస్టన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కూడా ఋగ్వేద ప్రతుల పంపిణీ జరిగింది. ఈ సంచికల తయారీలో తాను కూడా పాల్గొన్నానని జన్మభూమి సంపాదకులు గుర్తు చేసుకున్నారు. అయితే వాటికన్‌లోని సెక్యూరిటీ నియమాల ప్రకారం అన్ని బహుమతులు ముందుగానే సమర్పించాల్సి వుంటుంది. దీనిని తెలుసుకున్న ఎడిటర్ శ్రీకుమార్ వ్యక్తిగతంగా ఋగ్వేదాన్ని పోప్‌కి అందించడం కుదరలేదు. కానీ.. పోప్ ప్రసంగం తర్వాత ఆయన్ను వ్యక్తిగతంగా కలవొచ్చని వారి సిబ్బంది చెప్పడంతో ఎడిటర్ శ్రీకుమార్ వెంటనే ఋగ్వేద కాపీతో పోప్ దగ్గరికి వెళ్లి, సమర్పించారు. ఈ పుస్తకం హిందూ తత్వశాస్త్రానికి పునాది అయిన పుస్తకమని పోప్‌కి వివరించారు. అప్పుడు పోప్ నవ్వుతూ ‘‘ఇది నా కోసమేనా’’ అంటూ నవ్వుతూ అడిగారు.





