News

విశాఖలో ఆర్గానిక్ మేళా

229views

ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించి సేంద్రియ ఉత్పత్తులను దైనందిన జీవన విధానంలోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా వుందని మాజీ ఎమ్మెల్సీ బీజేపీ సీనియర్ నేత పి.వి.ఎన్ మాధవ పిలుపునిచ్చారు. విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్ లో గోఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం, రైతు సాధికార సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఐదవ విశాఖ ఆర్గానిక్ మేళాను గురువారం ప్రారంభించారు. మూడు రోజులు పాటు జరిగే ఈ కార్యక్రమంలో సేంద్రియ వ్యవసాయ పద్ధతులు, వాటి ఉత్పత్తులను వినియోగించడం వల్ల కలిగే ప్రయోజనాలను నిపుణులు వివరించనున్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న పీవీఎం మాధవ్ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర సంబంధించిన ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు తమ స్టాల్స్ ను ఇక్కడ ప్రదర్శించడం జరిగిందన్నారు. ఆర్గానిక్ ఉత్పత్తుల్లో లభించే పోషకాల గురించి ప్రతిఒక్కరూ తెలుసుకునేందుకు ఇదో చక్కటి అవకాశమన్నారు..

జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ మాట్లాడుతూ మనరాష్ట్రంలో 10 లక్షల మంది ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారన్నారని అయితే వాణిజ్య సంస్థలు కొన్ని ఈరంగంలోకి ప్రవేశించి వాటి ధరలను రెట్టింపు చేసి విక్రయిస్తున్నారని దీనిని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.దీనికి పరిష్కారం అధిక సంఖ్యలో ప్రకృతి వ్యవసాయం చేసే వారి సంఖ్య పెరగాలన్నారు‌‌.తద్వారా తక్కువ ధరకే ఉత్పత్తలు లభిస్తాయన్నారు.