News

అది మసీదు కాదు… దుర్గా దేవాలయమే : కోర్టు కీలక తీర్పు

231views

మహారాష్ట్ర కల్యాణ్ జిల్లాలోని చారిత్రాత్మక దుర్గాడి కోట విషయంలో 48 ఏళ్ల సుదీర్ఘ హిందువుల పోరాటం ఫలించింది. ఆ కోటలో దుర్గామాత ఆలయం వుందని, మసీదు కాదని కల్యాణ్ జిల్లా సెషన్స్ కోర్టు తేల్చి చెప్పింది. ఇది వక్ఫ్ ఆస్తి కాదని కూడా కోర్టు తేల్చి చెప్పింది. ఈ స్థలం ఛత్రపతి శివాజీ మహారాజ్ కాలం నుంచే మసీదు అని, ఇది వక్ఫ్ ఆస్తి అని మజ్లిస్- ఇ- ముషవ్రీన్ మసీద్ ట్రస్ట్ క్లెయిమ్ చేస్తూ వస్తోంది. అంతేకాకుండా అది హిందువుల స్థలమని తప్పుగా పేర్కొంటున్నారని కూడా తెలిపింది.అంతేకాకుండా ఈ కేసును వెల్ఫేర్ కోర్టు నుంచి వక్ఫ్ బోర్డుకి బదిలీ చేయాలని కూడా ముస్లిం సంస్థ కోరింది. అయితే.. ముస్లిం సంస్థ వాదనలను సీనియర్ డివిజన్ జడ్జీ తోసిపుచ్చారు.

ఈ కేసు 50 ఏళ్లుగా కొనసాగుతోందని హిందూ మంచ్ అధ్యక్షుడు, పిటిషనర్ దినేష్ దేశ్ ముఖ్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని మీడియాతో పంచుకున్నారు. తొలుత ఈ కోర్టు థానే జిల్లా కోర్టులో విచారణ జరిగింది. ఆ తర్వాతే కల్యాణ్ జిల్లా సెషన్స్ కోర్టుకి బదిలీ అయ్యిందని తెలిపారు.1971 లో థానే జిల్లా కలెక్టర్ ఈ స్థలాన్ని దేవాలయంగా ప్రకటించారని దినేశ్ దేశ్ ముఖ్ వెల్లడించారు. అయితే ఆ తర్వాత స్థలాన్ని మసీదుగా పేర్కొంటూ పిటిషన్ దాఖలైంది. ఇది దేవాలయమని హిందువుల తరపున న్యాయవాది పేర్కొన్నారు. మరోవైపు కోర్టు ఇచ్చిన తాజా తీర్పుపై హిందూ సమాజం హర్షం వ్యక్తం చేసింది. ఇది హిందువుల భారీ విజయమని ప్రకటించారు.