News

ఆనంద నిలయం స్వర్ణమయం దాతలకు వీఐపీ బ్రేక్ దర్శనం…!

324views

తిరుమల ఆనంద నిలయం అనంత స్వర్ణమయం పథకానికి విరాళం అందజేసిన దాతలకు వీఐపీ బ్రేక్ (జనరల్) దర్శనాలు కల్పించాలని తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి (TTD) నిర్ణయించింది.

టీటీడీ 2008లోనే ఈ విధానానికి సంకల్పించగా అనివార్య కారణాలతో నిలిపివేశారు. ఈ పథకం కింద విరాళం ఇచ్చిన దాతలకు అర్చనానంతర దర్శనం కల్పించాలని అప్పట్లో నిర్ణయించారు. ప్రస్తుతం అర్చనానంతర దర్శన సేవ లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా వీఐపీ బ్రేక్ (జనరల్)దర్శనం కల్పించనున్నారు.

⁠అర్చనానంతర దర్శనానికి బదులుగా గరిష్టంగా 5 మంది కుటుంబ సభ్యులకు సంవత్సరానికి 3 రోజులు వీఐపీ బ్రేక్ (జనరల్)దర్శనాలు కల్పిస్తారు. అలాగే ⁠రూ.2,500/- టారిఫ్‌లో సంవత్సరానికి 3 రోజులు వసతి కల్పించనున్నారు. ఏడాదికి ఒకసారి 20 చిన్న లడ్డూలు ప్రసాదంగా అందజేయనున్నారు. ⁠ సంవత్సరానికి ఒకసారి బహుమానంగా దుపట్టా, బ్లౌజ్ బహుమానంగా అందిస్తారు.

మొదటిసారి దర్శన సమయంలో 5 గ్రాముల బంగారు డాలర్, 50గ్రాముల వెండి నాణెం బహుమానంగా ఇవ్వాలని కూడా నిర్ణయించారు. ⁠సంవత్సరానికి ఒకసారి పది మహాప్రసాదం ప్యాకెట్లు అందిస్తారు. ⁠విరాళం పాస్‌బుక్ జారీ చేసిన తేదీ నుంచి 25 ఏళ్ళ పాటు ఈ విధానం చెల్లుబాటులో ఉంటుంది.