News

ప్రోబా-3 ఉపగ్రహ ప్రయోగం విజయవంతం

52views

విదేశీ ఉపగ్రహాలను సురక్షితంగా కక్ష్యలోకి చేరుస్తూ.. అంతర్జాతీయ మార్కెట్‌లో తనకంటూ ఒక బ్రాండ్‌ను సృష్టించుకున్న ఇస్రో ఖాతాలో మరో ఘన విజయం వచ్చి చేరింది. తన విజయాశ్వం పీఎ్‌సఎల్వీ-సీ59 రాకెట్‌ ద్వారా ఇస్రో చేపట్టిన ప్రోబా-3 ప్రయోగం విజయవంతమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం షార్‌ నుంచి యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ (ఈఎ్‌సఏ)కి చెందిన రెండు ఉపగ్రహాలతో కూడిన ప్రోబా-3ను మోసుకెళ్లిన పీఎ్‌సఎల్వీ-సీ59 దాన్ని సురక్షితంగా నిర్దేశిత కక్ష్యలోకి చేర్చింది. వాస్తవానికి ఈ ప్రయోగాన్ని బుధవారమే నిర్వహించాల్సి ఉన్నప్పటికీ.. ప్రయోగానికి గంట ముందు రాకెట్‌కు అనుసంధానం చేసిన ఉపగ్రహంలో సాంకేతిక సమస్యను గుర్తించడంతో.. గురువారానికి వాయిదా వేశారు.