News

రాష్ట్ర పండగగా రథసప్తమి

71views

శ్రీకాకుళం జిల్లాలోని దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే గొండు శంకర్‌ పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరంలోని దేవాదాయశాఖ సహాయ కమిషనర్‌ కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. అరసవల్లి సూర్యనారాయణ స్వామి క్షేత్రంలో రథసప్తమి ఉత్సవాన్ని రాష్ట్ర పండగగా నిర్వహించేందుకు త్వరలో ఉత్తర్వులు విడుదల కానున్నాయని చెప్పారు. జిల్లాలో ప్రభుత్వ ఆధీనంలోని ఆలయాల ఆదాయం, ఆస్తుల వివరాలు తెలియజేయాలని ఆదేశించారు. ఆక్రమణకు గురైన దేవాలయాల భూములను స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. ఆదిత్యాలయంలో ప్రసాద్‌ పథకాన్ని అమలు చేయమని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరగా.. ఆయన సుముఖత వ్యక్తం చేశారని తెలిపారు. అరసవల్లి, శ్రీకూర్మం దేవస్థానాల్లోని పుష్కరిణుల అభివృద్ధికి చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు.