News

భారతీయ సాంప్రదాయ వైద్యం ఆయుర్వేదం

71views

భారతీయ సాంప్రదాయ వైద్యం ఆయుర్వేదంమని
నంద్యాల ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల అధికారి డా. యశోదర తెలిపారు.”ప్రకృతి కా పరీక్షన్ అభియాన్”హలో భాగంగా ఆయుర్వేద వైద్యంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ జి. యశోదర మాట్లాడుతూ, పంచ మహాభూతాలైన పృద్వి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము అనే పదార్థాలతో నిర్మించబడినదని..ఇదే విధంగా ప్రకృతిలో భాగమైన మనిషి శరీరం కూడా ఈ ఐదు పంచ మహాభూతాలతోనే నిర్మితమై ఉంటుందన్నారు. ఈ పంచ మహాభూతాల ప్రభావం వల్ల మనుషుల శరీరాలు వాత, పిత్త, కఫ అనే మూడు రకాల ప్రకృతులలో ఏదో ఒక ప్రకృతిని కలిగి ఉంటాయ న్నారు. కొంతమంది శరీరతత్వం వాత ప్రకృతి గాను, కొంతమంది పిత్త ప్రకృతిగాను, కొంతమంది కఫ ప్రకృతిగాను ఉంటాయన్నారు. ఈ ప్రకృతిని బట్టి మనుషులకు జబ్బులు రావడం, రాకపోవడం అనేవి జరుగుతూ ఉంటాయన్నారు. భారత ప్రభుత్వ ఆయుష్ డిపార్ట్మెంట్ వారు దేశమంతా పౌరులు తమ శరీర ప్రకృతిని తెలుసుకోవడానికి కోసం దేశ్ కా ప్రకృతి పరీక్షన్ అభియాన్ అనే కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. దానిలో భాగంగా ఈ నెల 26వ తేదీన భారత ప్రధాన మంత్రి గారిచే” ప్రకృతి పరీక్షణ్” అనే ఒక మొబైల్ అప్లికేషన్ ప్రారంభించారన్నారు. ఈ మొబైల్ ఫోన్ అప్లికేషన్ ద్వారా ప్రజలు తమ తమ శరీర ప్రకృతిని తెలుసుకొని దాని ద్వారా ఆ ప్రకృతి అనుసరంగా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి జబ్బులు రాకుండా చూసుకోవచ్చన్నారు. ప్రజలు తమ దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలకు తమ స్మార్ట్ ఫోన్ తో వెళితే అక్కడ వైద్యులు ప్రకృతి పరీక్ష అనే మొబైల్ అప్లికేషన్ ద్వారా ప్రకృతి వివరాలు తెలియజేయడం జరుగుతుందన్నారు.