News

హైందవ శంఖారావం జయప్రదం చేయాలి

346views

ధర్మరక్షణలో భాగంగా హిందూ దేవాలయాలకు ప్రభుత్వాల నుంచి విముక్తి కలిగించాలనే సంకల్పంతో జనవరి 5న విజయవాడలో నిర్వహించే ‘హైందవ శంఖారావం’ బహిరంగ సభను జయప్రదం చేయాలని విశ్వ హిందూ పరిషత్ మండల సభ్యులు చెన్నకేశవులు, హేమంత్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రకాశం జిల్లా కురిచేడు మండలంలోని దేవనకొండ, పెద్దవరం గ్రామంలో కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సనాతన ధర్మం మన జీవన విధా నంలో భాగమని తెలిపారు. ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకుని దేవాలయాల పరిరక్షణకు తమవంతు కృషి చేయాలని తెలిపారు.