
స్విట్జర్లాండ్ ప్రభుత్వం బుర్ఖాపై నిషేధం విధించింది. బురఖా, నిఖాబ్ వంటి వాటిపై జనవరి 1,2025 నుంచి అమలులో వుంటుందని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.జాతీయ భద్రత దృష్ట్యా, అలాగే ఇతర కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే స్విట్జర్లాండ్ పార్లమెంటులోని ఉభయ సభలు ఈ బిల్లుకు ఆమోదం తెలిపాయి. బుర్ఖా లేదా ఇతర ఏదేని వస్త్రంతో ముఖాన్ని కప్పుకోవడాన్ని బ్యాన్ చేసే బిల్లును బుధవారం స్విట్జర్లాడ్ పార్లమెంటు ఆమోదం తెలిపింది.అయితే 2021 లో అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. దీని తర్వాతే బుర్ఖాపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
అయితే ఈ నిర్ణయంపై ముస్లిం సంఘాలు, హక్కుల సంఘాలు, న్యాయవాద సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. కేవలం 51 మంది మాత్రమే బుర్ఖాపై నిషేధానికి మద్దతిచ్చారు. ఎంత మంది వ్యతిరేకించినా… స్విట్జర్లాండ్ మాత్రం నిషేధం విధిస్తూ చట్టం చేసింది. ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారికి భారీ మొత్తంలో జరిమానా కూడా విధించింది అక్కడి ప్రభుత్వం. ఇండియన్ కరెన్సీ ప్రకారం 90 వేల వరకూ జరిమానా విధిస్తారు.
అయితే… కొన్ని ప్రదేశాలలో మాత్రం ప్రభుత్వం బుర్ఖాకి మినహాయింపును ఇచ్చింది. విమానాశ్రయాలు, ప్రార్థనా స్థలాలు, ఇతర పవిత్ర స్థలాలు, ప్రమాదకరమైన ప్రదేశాలు, ఆరోగ్యరీత్యా కచ్చితంగా బుర్ఖా ఉంచుకోవాల్సిన ప్రదేశాలు, బహిరంగ సభలు, నిరసన ప్రదేశాల్లో మాత్రం మినహాయింపు వుంటుందని ప్రభుత్వం తెలిపింది.
ఇప్పటి వరకు 16 దేశాలు బుర్ఖాను నిషేధించిన జాబితాలో వున్నాయి. తాజాగా స్విట్జర్లాండ్ కూడా చేరిపోయింది. ట్యూనిషియా, ఆస్ట్రియా, డెన్మార్క్, ఫ్రాన్స్, బెల్జియం, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, బల్గేరియా, కెమరాన్, ఛాడ్, చైనా, గాబోన్, నెదర్లాండ్స్, కాంగో రిపబ్లిక్, మోరోకో, శ్రీలంక దేశాల్లో బుర్ఖా నిషేధంలో వుంది.





