
451views
ప్రపంచ తెలుగు మహాసభలు 2026 జనవరి 3, 4, 5 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి ముఖ్య సమన్వయకర్తగా పి.రామచంద్రరాజు, సహ సమన్వయకర్తగా వాసిరెడ్డి విద్యాసాగర్‌లను నియమించారు. గుంటూరులో మంగళవారం నిర్వహించిన సభలో ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ ఈ వివరాలు వెల్లడించారు. పరిషత్ ప్రపంచ తెలుగు మహాసభలను తొలుత భీమవరంలో, రెండోసారి రాజమహేంద్రవరంలో విజయవంతంగా నిర్వహించామన్నారు. తెలుగు సాంస్కృతిక రాజధాని అయిన అమరావతి ప్రాంతం (గుంటూరు)లో మూడోసారి నిర్వహించనున్నట్లు తెలిపారు. రామచంద్రరాజు మాట్లాడుతూ ఈ మహాసభల్లో తెలుగు కళారూపాలు, పద్య విభావరి, సాహిత్య కార్యక్రమాలతో పాటు చలనచిత్ర ప్రముఖులతో సాంస్కృతికాంశాలు, బుల్లితెర నటీనటులతో కార్యక్రమాలు రూపొందిస్తున్నట్లు వివరించారు.





