News

మువ్వన్నెల రంగుల్లో మెరిసిపోయిన కాశీ విశ్వనాథుడు

58views

78 స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని విద్యుద్దీపకాంతులతో త్రివర్ణ పతాకాన్ని తలపించేలా ముస్తాబు చేశారు. ఆలయం లోపలి శివలింగాన్ని కూడా వివిధ పుష్పాలు, పత్రాలతో త్రివర్ణశోభితంగా అందంగా తీర్చిదిద్దారు. ఈ విధంగా ఆధ్యాత్మికతలోనూ జాతీయతను జోడించి భక్తులు, ఆలయ నిర్వాహకులు స్వాతంత్ర్య దినోత్సవాన్ని నిర్వహించుకున్నారు. ఇటు మధ్యప్రదేశ్ ఉజ్జయిని మహాకాల్ ఆలయం కూడా మూడు రంగుల్లో మెరిసిపోయింది.


శ్రావణమాస శోభతో వెలిగిపోతున్న కాశీ విశ్వేశ్వరుని ముంగిట నేడు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. స్వామివారి దర్బారును అందంగా అలంకరించారు. ఇందుకోసం జాతీయ పతాకంలో కనిపించే కాషాయం, తెలుపు, ఆకుపచ్చల రంగులు కలిగిన పూలను వినియోగించారు. ఆలయానికి వచ్చిన భక్తులు హరహర మహాదేవ్‌తో పాటు జై భారత్‌ మాతాకీ అంటూ నినాదాలు చేశారు. తెల్లవారు జామునే త్రివర్ణాలతో అలంకృతుడైన మహాశివుణ్ణి చూసి భక్తులు ఉప్పొంగిపోయారు.