డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామ మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామి మూలవిరాట్ దర్శనాలకు ఈ నెల 7 నుంచి భక్తులకు అవకాశం కల్పిస్తున్నారు. ఆలయ ఈఓ పితాని తారకేశ్వరరావు విలేకర్లకు ఈ విషయం తెలిపారు. కేంద్ర పురావస్తు శాఖ ఆధ్వర్యాన మూలవిరాట్ జీర్ణోద్ధరణ పనులు చేపట్టిన విషయం తెలిసిందే. వీటిని పూర్తి చేసిన అనంతరం ఈ నెల 5 నుంచి 7 వరకూ సంప్రోక్షణ, విశేష కార్యక్రమాలు నిర్వహించనున్నామని ఈఓ తెలిపారు. 5న కళావాహన, గణపతి పూజ, పుణ్యాహవాచనం, పరిషత్, కుచ్చత్రయం, మండపారాధన, రుత్విక్ వరుణలు, దీక్షధారణ, కృష్ణ యజుర్వేద పారాయణ, గణపతి హోమం, వాస్తు హోమం, చతుర్వేద స్వస్థి నిర్వహిస్తామని వివరించారు. 6న గణపతి పూజ, పుణ్యాహవాచనం, కుచ్చత్రయం, పునఃపూజలు, ఉదయ శాంతి, శతరుద్ర, శ్రీసూక్త, దుర్గా సూక్త, శుక్ల యజుర్వేద పారాయణలు, రుద్ర, చండీ హోమాలు, చతుర్వేద స్వస్తి జరుగుతాయన్నారు. ఏడో తేదీన గణపతి పూజ, పునఃపూజలు, రుగ్వేద పారాయణ, గర్భాలయ పూజలు, పరివార దేవతార్చనలు, కుంభాలు, గోదర్శనం, శాంతి హోమం, పూర్ణాహుతి అనంతరం ఉదయం 9.34 గంటలకు కళావాహన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు. అనంతరం ఉదయం 11.05 గంటల నుంచి భక్తులను దర్శనాలకు అనుమతిస్తామని ఈఓ తెలిపారు.
45
You Might Also Like
రాహుల్, హోదాకు తగ్గట్టు ప్రవర్తించండి!
రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని అనవసరంగా, అసందర్భంగా దూషించడం రాహుల్ గాంధీకి ఒక రాజకీయ వైచిత్రిగా మారింది. ఈ సంస్థపై అవాకులు చవాకులు పేలడం ఆయన దినచర్యలో...
విజయవాడ దుర్గగుడి ఆదాయం రూ. 82.03 లక్షలు
22
విజయవాడలో వెలసిన దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం హుండీలకు రూ. 82.03లక్షల ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు వెల్లడించారు. 15 రోజుల ఆదాయాన్ని లెక్కించగా రూ. 82.03,392 లు...
శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టీటీడీ ఈవో సమీక్ష
22
తిరుమలలో అక్టోబరు 4 నుంచి 12వ తేదీ వరకు జరగనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల సందర్భంగా టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్...
మన్యం రైతుకు అరుదైన గుర్తింపు
29
మన్యం కాఫీ ప్రతిష్ఠ ఇప్పటికే ఖండాంతరాలు దాటింది. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం లంబసింగి సమీపంలోని అసరాడ గ్రామానికి చెందిన గిరిజన రైతు లాకారి వెంకటరావును...
పోర్ట్ బ్లెయిర్ పేరు మార్పు.. ఇకపై శ్రీ విజయపురం
27
అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్ పేరును కేంద్ర ప్రభుత్వం మార్చింది. ఇకపై దానిని ‘శ్రీ విజయపురం’గా వ్యవహరించాలని నిర్ణయించింది. వలసవాద ఆనవాళ్ల నుంచి బయటపడేందుకు...
ఆర్.ఎస్.ఎస్. ప్రచారక్ మల్లాపురం భీష్మాచార్యులు కన్నుమూత
41
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) జ్యేష్ఠ ప్రచారక్ మల్లాపురం భీష్మాచార్యులు (73) గురువారం రాత్రి (సెప్టెంబర్ 12, 2024) తుదిశ్వాస విడిచారు. ఆయన నాగపూర్లో జరిగిన ఓ...