News

కేంద్రం కీలక నిర్ణయం : వక్ఫ్ బోర్డు విశేష అధికారాల కోతకు ముహూర్తం ఖరారు

43views

వక్ఫ్ బోర్డు విశేష అధికారాలకు కేంద్ర ప్రభుత్వం కోత వేయాలని నిర్ణయించింది. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో దీనికి సంబంధించిన చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టే అవకాశముంది. దేశంలో 30 వక్ఫ్ బోర్డులున్నాయి. వాటి పరిధిలో 9 లక్షలకుపైగా ఎకరాల భూమి ఉంది. ఇక నుంచి వక్ఫ్ బోర్డులో మహిళలకు కూడా స్థానం కల్పించనున్నారు. 40కుపైగా సవరణలు చేసేందుకు కేంద్రం సిద్దమవుతోంది.

ప్రస్తుతం వక్ఫ్ బోర్డుకు విశేష అధికారాలున్నాయి. వాటి చేతుల్లో లక్షల కోట్ల విలువైన భూములున్నాయి. వాటి నిర్వహణలో అనేక అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కేంద్రం, వాటి అధికారాలకు కత్తెర వేయనుంది. మూడు కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏదైనా ఆస్తులను కట్టబెట్టడంతో వక్ఫ్ బోర్డుకు విశేష అధికారాలున్నాయి. వాటికి కత్తెర వేయనున్నట్లు సమాచారం.