
ప్రధానమంత్రి నరేంద్రమోడీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమిళనాడు రాష్ట్రంలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని సోషల్ మీడియా వేదికగా తిప్పికొట్టడంలో కీలకపాత్ర పోషించిన మధురైకి చెందిన ప్రొఫెసర్ మరిదాస్, ప్రతిపక్ష డీఎంకే నుంచి తీవ్రమైన దాడిని, వేధింపులను ఎదుర్కుంటున్నారు.
ఈ అంశం కారణంగా సోషల్ మీడియా #ISupportMaridhas , #MentalMaridas ‘ అనే రెండు వర్గాలుగా చీలిపోయింది. డీఎంకే వర్గాలు తీవ్రమైన వ్యాఖ్యలతో మరిదాస్ పై విరుచుకు పడుతున్నారు.
డిఎంకే ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఆర్ ఎస్ భారతి సెక్షన్ 505 (2) కింద మరిదాస్ పై క్రిమినల్ చర్యలకు పూనుకున్నారు. ఒక వర్గానికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టడానికి ఉద్దేశించిన ప్రకటనల ప్రచురణ, ప్రచారం కారణంగా అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అతని యొక్క ఫేస్బుక్ పేజీ మరియు యూట్యూబ్ ఛానెళ్ళను తొలగించాలని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ క్రింద సిటీ పోలీస్ కమీషనర్ కు ఫిర్యాదు చేశారు.

“ఆర్టికల్ 370పై డీఎంకే హిజ్ బుల్ ముజాహిదీన్, లష్కర్ -ఏ- తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలకు మద్దతుగా నిలుస్తోంది. పాకిస్థాన్ నుంచి డీఎంకేకు డబ్బులందుతున్నాయా? పాకిస్థాన్ కు, డీఎంకేకు మధ్య అవగాహన ఉందా?” అని ప్రశ్నిస్తూ మరిదాస్ చేసిన వీడియోకి తమిళనాడులో ఆగస్టు 27 నాటికి 167,285 కు పైగా views వచ్చాయి.
ఆగస్టు 12 నాడు ఆర్టికల్ 370 రద్దుపై రిపబ్లిక్ టీవీలో జరిగిన ఒక చర్చలో డీఎంకే అధికార ప్రతినిధి శరవణన్ “కాశ్మీర్ ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగం కాదు” అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఫాసిస్టు విధానాలతో కాశ్మీర్ ప్రజల హక్కులను కాలరాస్తోందని విమర్శించారు. బీజేపీకి చెందిన అమన్ సిన్హా శరవణన్ మాటలకు అడ్డు తగులుతూ “కాశ్మీర్ ఎప్పటికీ భారత్ లో అంతర్భాగమే” అన్నారు. దానికి శరవణన్ బదులిస్తూ “అది మీ కల. కశ్మీర్ ఎప్పుడూ భారతదేశంలో అంతర్భాగం కాదు.” అని పునరుద్ఘాటించారు.
మరిదాస్ దీనిపై స్పందిస్తూ “డీఎంకే ఉగ్రవాదులకు మద్దతు పలికింది“, డీఎంకే లో జాతి వ్యతిరేక శక్తులున్నాయి” అని విమర్శిస్తూ దానికి ఆధారాలను చూపిస్తూ ఒక వీడియోను ఆదివారం పోస్ట్ చేశారు. “కాశ్మీర్ పరిణామాలకు సంబంధించి జంతర్ మంతర్ వద్ద డీఎంకే నేత ఎంకె స్టాలిన్ చేసిన నిరసన గురించి రేడియో పాకిస్థాన్ అధికారిక నిర్వాహక కేంద్రం ఎందుకు ట్వీట్ చేసింది?” అని కూడా మరిదాస్ ప్రశ్నిం చారు.
ద్రవిడ విదుత్తలై కచ్చ వంటి సంస్థలు పౌర హక్కుల పేరుతో, మే 17న నిర్వహించిన ఆందోళనను ఉటంకిస్తూ డీఎంకే కు అనుబంధంగా ఉన్న సంస్థలను, ఇతర పార్టీలను కూడా జాతీయ వ్యతిరేక శక్తులుగా ఆయన అభివర్ణించారు. 2018లో మరిదాస్ “నాన్ ఎన్ మోడీయా ఆదారిక్కిరెన్” (నేను మోడీని ఎందుకు సమర్దిస్తానంటే) అనే పుస్తకాన్ని వ్రాశారు. ఏది ఏమైనప్పటికీ సోషల్ మీడియాలో అత్యధికుల మద్దతు మరిదాస్ కే వుండడం గమనార్హం. దీనిపై మరిదాస్ “సోషల్ మీడియాలో నాకు మద్దతుగా నిలుస్తున్న వారికి ధన్యవాదాలు. ఎట్టకేలకు తమిళ ప్రజలు జాతి వ్యతిరేకుల నిజ స్వరూపాన్ని తెలుసుకుంటున్నారు”. అని పోస్ట్ చేశారు.





