
254views
ఆలయానికి వెళ్లినప్పుడు తీర్థం తీసుకోవడం పరిపాటి. నీరే శంఖంలో పోస్తే తీర్థం అవుతుంది. అలాంటి నీటిని తీసుకొంటే వాతపిత్త దోషాలు పోతాయని వైద్యశాస్త్రం చెబుతోంది. దానివల్ల శక్తి, పుష్టి సైతం కలుగుతాయన్నది పెద్దల మాట. ‘భగవత్పాద తీర్థంతు నిత్యం యః పిబేత్ నరః/ ఆరోగ్యవాన్ సదా భూత్వాసాయుజ్యం లభతే…’ స్వామి తీర్థాన్ని పుచ్చుకొనేవాడు ఆరోగ్యంగా ఉంటాడని, పరమేశ్వర సాయుజ్యాన్ని పొందుతాడని పరమపురుష సంహిత వివరిస్తోంది. తులసితో కూడిన సాలగ్రామ తీర్థం అన్ని రోగాలను పోగొడుతుందని ఉద్ఘాటిస్తోంది. అకాల మృత్యువు సంభవించకుండా రోగాల్ని, పాపాల్ని హరించమనే ప్రార్థనతో తీర్థం తీసుకొంటారు. ఈ నీటిలో వేసే తులసికి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి.




