News

తవ్వకాలలో బయటపడిన ప్రాచీన విగ్రహం

343views

ఝార్ఖండ్లోని నగర్ పంచాయతీ పరిధిలో ఒక రెండువందల ఏళ్లనాటి ఆలయాన్ని పునరుద్ధరణ కోసం తవ్వుతున్న నేపథ్యంలో ఒక ప్రాచీన విగ్రహం బయటపడింది. ఆలయ పునాదులను తవ్వుతున్న సందర్భంలో బయటపడిన ఈ విగ్రహం నారాయణుడిదా లేక శివపార్వతులదా అనేది ఇంకా తేలలేదు. ఇటీవలే వార్షికోత్సవాలు జరుపుకున్న ఈ ఆలయ పునరుద్ధరణకు పురబ్ షరీరాకు చెందిన ధీరేంద్ర సింగ్ నడుంకట్టాడు. ఆలయ ప్రాంగణంలో భూమిని మట్టం చేసేందుకు తవ్వుతున్న సందర్భంలో ఈ విగ్రహం బయటపడడంతో అందరూ ఉద్విగ్నతకు లోనవుతున్నారు. ఈ విగ్రహం వెయ్యేళ్లనాటిదని పలువురు విశ్వసిస్తుండగా, అధికారికంగా ఎవరూ ఖరారు చేయలేదు. విగ్రహాన్ని ఆలయం లోపల ఉంచి పూజలు, భజనలు నిర్వహిస్తున్నారు. ఏఎస్ఐ ఈ విగ్రహం ఎవరిదో, ఏ కాలం నాటిదో చెప్తుందని ఆలయ పెద్దలు చెపుతున్నారు.