
560views
ప్రధాని మోడీకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అత్యున్నత పురస్కారం లభించింది. యూఏఈలో పర్యటించిన ప్రధాని మోడీని “ఆర్డర్ ఆఫ్ జాయేద్ మెడల్” తో ఆ దేశపు యువరాజు మహ్మద్ బీన్ జాయెద్ సత్కరించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్, బ్రిటన్ రాణి ఎలిజబెత్, సౌదీ రాజు సల్మాన్ బిన్ తదితరులు ఈ పురస్కారాన్ని అందుకున్న వారిలో ఉన్నారు.

కాగా ప్రధాని మోడీకి ఈ పురస్కారాన్ని అందించడం పై పాకిస్థాన్ తన అక్కసును వెళ్ళగక్కింది. ప్రధానికి ఈ పురస్కారం ప్రకటించగానే పాక్ సెనేట్ చైర్మన్ సాధిక్ సంజరాని యూఏఈ పర్యటనను రద్దు చేసుకున్నారు.





