
అక్రమంగా రవాణా అవుతున్న 5 ఆవులు, 2 గేదె దూడలను అమలాపురం పట్టణ ఎస్సై కిషోర్‌బాబు ఆధ్వర్యంలో పోలీసులు స్థానిక శ్రీ గౌతమ గో సంరక్షణ సమితి గోశాలకు అప్పగించారు. గత నెల 25వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో ఈదరపల్లి టీడీపీ కళ్యాణ మండపం వద్ద ఏ విధమైన అనుమతులు లేకుండా వాటిని వాహనంలో అక్రమంగా తరలిస్తున్నప్పుడు విశ్వ హిందూ పరిషత్, భజరంగ దళ్ కార్యకర్తలు అడ్డగించి స్థానిక పట్టణ పోలీసు స్టేషన్‌లో అప్పగించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆ మూగ జీవాలను అమలాపురం రూరల్ మండలం ఇందుపల్లికి చెందిన ఆకెళ్ల వెంకట నారాయణమూర్తి పోషించారు. ఇప్పుడు ఆ ఆవులు, దూడల సంరక్షణ బాధ్యత స్థానిక గోశాలకు అప్పగించారు. ఈ కానిస్టేబుల్ ఆర్.శ్రీనివాస్, ఆకెళ్ల వెంకట నారాయణమూర్తి తదితరులు గోశాల ప్రతినిధులు లింగోలు పుల్లయ్య నాయుడు, కేవీ మావుళ్లయ్య, గోశాల సేవకుడు సత్యాల రాజులకు వాటిని అప్పగించారు.





