
“రక్షితా స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షితా రక్షితా జీవలోకస్య ధర్మస్య పరిరక్షితా”
ధర్మం అంటే ఏమిటో నిర్వచించటం కష్టమే అయినప్పటికీ మనస్సుకు అవగాహన ఏర్పడాలి కదా కొద్దిగానో, గొప్పగానో. అందుకోసం వివిధ రీతులలో ప్రబోధాలు చేశారు మన పెద్దలు. ఆ ప్రయత్నాలలో ఒక భాగమే రామాయణం, రాముణ్ణి అర్థం చేసుకొంటే ధర్మాన్ని అర్థం చేసుకున్నట్లే. ధర్మం అనేది మానవ సంబంధాల రూపంగా ఉంటుంది. ఆ సంబంధాల వల్ల ఏర్పడిన కర్తవ్య రూపంగా ఉంటుంది. ఒక మనిషిలోనే శరీరం, ప్రాణం, మనస్సు, బుద్ధి, ఆత్మ అనేవి ఉంటాయి. వీటి నడుమ ఎలాంటి సంబంధం ఉండాలి? ఎలాంటి సమన్వయం ఉండాలి? కుటుంబంలో వివిధ వ్యక్తుల నడుమ ఎలాంటి సంబంధాలు ఉండాలి? ఎలాంటి సమన్వయం ఏర్పడాలి? సమాజంలో వ్యక్తుల నడుమ ఎలాంటి సంబంధాలు ఉండాలి? వ్యక్తి సమాజాల నడుమ ఎలాంటి నమన్వయం ఉండాలి? ప్రపంచంలో వివిధ సమాజాలున్నాయి. వివిధ దేశాలు ఉన్నాయి. వీటి నడుమ ఎలాంటి సంబంధాలుండాలి? జాతుల నడుమ ఎలాంటి సమన్వయం ఏర్పడాలి? ఇలాంటి సంబంధాల సముచ్ఛయ స్వరూపం ధర్మం. ధర్మం అంటే సామంజస్య భావన. సమస్టి భావన.
మార్పు చెందవలసిన నియమాలు. రద్దీ పెరిగే దానినిబట్టి లేదా తరిగే దానిని బట్టి ఈ నియమాలు కొత్త కొత్త రూపాలను సంతరించుకుంటాయి. బందోబస్తు మారుతుంటుంది. గస్తీ మారుతుం టుంది.
ఇందులో కొన్ని అవద్ధర్మాలుంటాయి. ఎదుటివాడు తనకు ఎడమవైపున రావాలి. కాని కుడి వైపున వస్తున్నాడు. వేగంతో వాహనం మీద వస్తున్నాడు. అప్పుడు ఇవతలివాడు వెంటనే కుడి వైపుకు తప్పుకుంటాడు. ఇప్పుడు ఎడమవైపునకే పోవాలి అనే నియమం ఉల్లంఘించినట్లయ్యింది. ఇది సాధారణ పరిస్థితులలో అయితే నియమోల్లం మనమే. కాని ఇక్కడ కాదు. ఇక్కడ ఇలా తప్పుకున్నందుకు కేసుపెట్టరు. ఆపద్ధర్మలక్షణం ఇది.
రాముని జీవితాన్ని మనం ఈ దృష్టితో చూడాలి. అప్పుడు ఎన్నో ధర్మాలు తెలుస్తాయి. ధర్మ సూక్ష్మాలు తెలుస్తాయి. ధర్మ స్వరూపం అవగతం అవుతుంది. వ్యక్తి జీవితంలోగాని, సమష్టి జీవితంలోగాని ఎటువంటి సమన్వయం, ఎటువంటి సామంజస్యం ఉండాలో తెలుస్తుంది. సమష్టి భావన అనేది ధర్మ స్వరూపమని తెలుస్తుంది. “రామోవిగ్రహవాన్ ధర్మః” అన్నది అందుకే.





