News

బద్రీనాథ్ కు పోటెత్తిన భక్తులు

81views

చార్‌ధామ్‌ యాత్ర లో భాగంగా బద్రినాథ్ ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయం తెరిచిన నెలరోజుల వ్యవధిలోనే 5 లక్షల మంది భక్తులు సందర్శించారు. గతేడాది తొలి నెల రోజుల్లో 4.5 లక్షల మంది బద్రినాథ్‌ ధామ్‌ను సందర్శిస్తే ఈ ఏడాది 50 వేల మంది భక్తులు అదనంగా దర్శించుకున్నారు.

చార్‌ధామ్‌ యాత్రకు ఇప్పటి వరకూ 19 లక్షల మంది భక్తులు వచ్చారని బద్రినాథ్ –కేథార్ నాథ్ ఆలయ కమిటీ ఉపాధ్యక్షుడు కిషోర్ పన్వార్ తెలిపారు. రానున్న రోజుల్లో మరింత ఎక్కువ మంది భక్తులు వస్తారని అంచనా వేసినట్లు తెలిపారు.

ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన కేథార్‌నాథ్ ఆలయ మార్గంలోనే బద్రినాథ్‌ ఆలయం ఉంటుంది. ఈ ఆలయం తలుపులు ఈ నెల 12న తెరుచుకున్నాయి. శీతాకాలంలో మూసివేసిన ఆలయాన్ని తిరిగి ప్రారంభించారు.

చార్‌ధామ్‌ యాత్రలో భాగమైన కేదార్‌నాథ్‌, యమునోత్రి, గంగోత్రి ఆలయాల్లో అక్షయ తృతీయ సందర్భం ప్రత్యేక పూజలు చేశారు. అప్పటి నుంచి భక్తులను ఆలయంలోకి అనుమతిస్తున్నారు.