News

మాతృభాషపై ప్రేమ.. కన్నడలో ప్రమాణం చేసిన కెనడా ఎంపీ

43views

ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారిలో చాలా మంది తమ మాతృభాషలో కాకుండా ఇంగ్లీష్‌లో ప్రమాణస్వీకారం చేసే రోజులివి. మన దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి ఎంపీలుగా ఎన్నికైన వాళ్లు మాతృభాషలో కాకుండా ఇంగ్లీష్‌, హిందీ భాషల్లో పార్లమెంటులో ప్రమాణస్వీకారం చేయడం, ప్రసంగించడం తరచుగా చూస్తుంటాం.

కానీ కెనడాలో ఎంపీగా ఎన్నికైన ప్రవాస కన్నడిగుడు చంద్రఆర్య అక్కడి పార్లమెంటులో కన్నడ భాషలో ప్రమాణస్వీకారం చేసి మాతృభాషపై తనకున్న ప్రేమను చాటుకున్నారు. చంద్రఆర్య కన్నడలో ప్రమాణస్వీకారం చేసిన వెంటనే సహచర ఎంపీలు ఆయనను సీట్లలో నుంచి లేచి అభినందించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
https://x.com/i/status/1799831036555346258
ఎంత ఎదిగినా ఎక్కడికి వెళ్లినా మనం ఎక్కడి నుంచి వచ్చాం అనేది మరచిపోవద్దని నెటిజన్లు చంద్ర ఆర్య వీడియోనుద్దేశించి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.