NewsProgramms

విశ్వహిందూ పరిషత్ అధ్వర్యంలో సామూహిక లక్ష్మీ పూజ

70views

శ్రావణ శుక్రవారం సందర్భంగా 16/8/2019 నాడు చారిత్రాత్మక ప్రసిద్ధి గాంచిన కృష్ణా జిల్లా, మొవ్వ గ్రామంలోని హరిజనవాడలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సామూహిక లక్ష్మీ పూజ జరిగింది. విశ్వ హిందూ పరిషత్ మొవ్వ మండలం ఉపాధ్యక్షురాలు శ్రీమతి మండవ బాలా త్రిపురసుందరి, తూర్పు కృష్ణ జిల్లా గోరక్షా ప్రముఖ్ శ్రీమతి మొవ్వ శ్రీరామ కుమారి ఆధ్వర్యంలో, స్థానిక కార్యకర్త శ్రీ వెంకటేశ్వరరావు సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు, విశ్వ హిందూ పరిషత్ తూర్పు కృష్ణ జిల్లా అధ్యక్షులు డాక్టర్ బి. ధన్వంతరి ఆచార్య సామూహిక లక్ష్మీ పూజ ప్రాధాన్యతను మహిళలకు వివరించి స్వయంగా మహిళల చేత పూజ చేయించారు. విశ్రాంత అధ్యాపకులు డాక్టర్ బి. సారంగపాణి మహిళలకు రామ నామ ప్రాశస్త్యం గూర్చి వివరించి “హరేరామ” నామ సంకీర్తన ప్రాధాన్యతను తెలియపరచారు. ఈ కార్యక్రమంలో హరిజన వాడలోని మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.