NewsProgramms

నెల్లూరు భారత్ దర్శన్ కార్యక్రమంలో మంత్ర ముగ్ధులైన శ్రోతలు

367views

నెల్లూరు నగరంలోని ఆచారి వీధిలో గల ది క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ హాలు నందు జరిగిన భారత్ దర్శన్ కార్యక్రమంలో  సక్షమ్ అఖిల భారత సంఘటనా కార్యదర్శి డా.సుకుమార్ గారు, ఆరెస్సెస్ ఆంధ్ర ప్రాంత కళాశాల విద్యార్ధి ప్రముఖ్ శ్రీ జనార్ధన్ గారు పాల్గొని ప్రసంగించారు. పుణ్య నదులు, పర్వతాలు, పుణ్య క్షేత్రాలు, చతుర్ధామాలు, జ్యోతిర్లింగాలు, శక్తి పీఠాలతో అలరారే పుణ్య భూమి భారత దేశం అని వారు తెలిపారు. ఈ దేశంలోని అణువణువూ కణకణమూ పవిత్రమైనదేనని, ఉన్నత, త్యాగమయ, ధీరోదాత్త చరిత్రకు మనం వారసులమని తెలిపారు.

ఆంగ్లేయుల కాలంలో దేశ స్వాతంత్ర్యోద్యమానికి నాయకత్వం వహించి, స్వాతంత్ర్యానంతరం అధికారాన్ని పొందిన నాయకుల అవివేకమైన చర్యలు, నిర్ణయాల వల్ల దేశం అనేక భూభాగాలను కోల్పోయిందని, లక్షల మంది అమాయకులు ప్రాణాలు పోగొట్టుకున్నారని, వేలాది దేవాలయాలు నేలమట్టమయ్యాయని వారు పేర్కొన్నారు. ఇన్నాళ్ళకు దేశానికి దేశభక్తి, చిత్తశుద్ధి కలిగిన నాయకత్వం లభించిందని, దేశాన్ని దశాబ్దాలుగా పట్టి పీడిస్తున్న అనేక సమస్యలకు పరిష్కారాలు లభిస్తున్నాయని తెలిపారు. మనందరి తపస్సు, సంకల్పం, దూర దృష్టి కారణంగానే దేశం అభివృద్ధి చెందుతుందని, కనుక భవ్య భారతావని నిర్మాణమే అందరి సంకల్పం కావాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పెద్దలు, మహిళలు, కళాశాల విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని వక్తలు డాక్టర్ సుకుమార్, శ్రీ జనార్ధన్ల ప్రసంగాలు ఆద్యంతం ఆసక్తిగా వినడం విశేషం.