NewsProgramms

దేశ ధర్మాల రక్షణకై కంకణబద్ధులమౌదాం – ఆరెస్సెస్ ప్రాంత సంఘచాలక్ శ్రీ శ్రీనివాస రాజు

164views

శ్రావణ పౌర్ణమి రక్షాబంధన్ సందర్భముగా ఒంగోలు లోని ఫ్యాన్సీగూడ్స్ మర్చంట్ అసోసియేషన్ హాల్  లో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్యవక్తగా పాల్గొన్న RSS ప్రాంత సంఘ్ చాలక్ మాననీయ శ్రీ శ్రీనివాసరాజు గారు మాట్లాడుతూ,సమాజములో దేశ,ధర్మాల పట్ల ప్రజలు కంకణబద్ధులగుటకు రక్షాబంధన్ ప్రేరణ కలిగిస్తుందని పేర్కొన్నారు.సమాజములో వస్తున్న జాతీయభావ ప్రేరణతోనే జమ్మూకాశ్మీర్ నేడు భారతదేశం లో సంపూర్ణముగా విలీనమైన పరిస్థితులను మనం చూస్తున్నామని చెప్పారు.రాజకీయాలకు అతీతంగా దేశ, ధర్మాల కొరకు జాగృతమై ఉండాలని వారు స్పష్టంచేశారు.

స్వయంసేవకులు,పురప్రజలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ప్రతిఒక్కరు “నీవు నాకు రక్ష, -నేను నీకు రక్ష ,మనమిద్దరం దేశానికి ధర్మానికి రక్ష” అని నినదిస్తూ రక్షలు ధరించారు. భరతమాత ప్రార్థన తో కార్యక్రమం పూర్తయింది.