News

భారత సైనికుల చేతిలో నలుగురు పాక్ రేంజర్లు హతం

539views

జమ్ముకశ్మీర్ నియంత్రణ రేఖ వద్ద ఉన్న ఉరీ, రాజౌరీ సెక్టార్ల వద్ద పాక్ జవాన్లు కాల్పుల ఉల్లంఘన ఒప్పందానికి తూట్లు పొడుస్తూ గురువారం నాడు కాల్పులకు తెగబడ్డారు. భారత జవాన్లు కూడా అదే స్థాయిలో ప్రతిస్పందించి, ముగ్గుర్ని హతమార్చారు. ఈరోజు ఉదయం మరొక పాక్ సైనికుడు ప్రాణాలను కోల్పోయాడు. ప్రాణాలు కోల్పోయిన పాక్ రేంజర్ల సంఖ్య నాలుగుకు చేరుకుంది. సరిహద్దుల్లోని ఇతర ప్రాంతాల్లో కూడా పాకిస్థాన్ కాల్పులకు తెగబడుతోంది. ఈ క్రమంలో సరిహద్దుల వద్ద మాటు వేసిన ఉగ్రవాదులను కశ్మీర్ లోకి జొప్పించేందుకు యత్నిస్తోంది. పాక్ కుటిల యత్నాలకు భారత్ ధీటుగా బదులిస్తోంది.