NewsProgramms

నెల్లూరు జయభారత్ లో రక్షాబంధన్

45views

నెల్లూరులోని జయభారత్ హాస్పిటల్ నందు సింహపురి వైద్య సేవా సమితి ఆధ్వర్యంలో గిరిజన ఆరోగ్య కార్యకర్తల సమావేశం  జరిగినది .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా గిరిజన సంక్షేమ ఆధికారి పాల్గొన్నారు.గిరిజనులకు ప్రభుత్వం ద్వారా జరుగుతున్న  పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సంస్థ ప్రధాన కార్యదర్శి శ్రీ హరికుమర్ రెడ్డి, ఉపాధ్యక్షులు శ్రీ బాలుసుబ్బరావు, హాస్పిటల్ మేనేజర్ శ్రీ గురుప్రసాద్ పాల్గొన్నారు.

కార్యక్రమం చివర్లో ఆరోగ్య కార్యకర్తలు “ నీవు నాకు రక్ష, నేను నీకు రక్ష, మనిద్దరం దేశానికి, ధర్మానికి రక్ష” అన్న సంకల్పాన్ని చెప్పుకుంటూ ఒకరికొకరు రాఖీలు కట్టుకున్నారు. ఈ సందర్భంగా హాస్పిటల్ మేనేజర్ శ్రీ గురుప్రసాద్ మాట్లాడుతూ. మనమందరం ఒకే తల్లి భరతమాత సంతానమని, కుల భేదాలు, అసమానతలు వీడి అందరం ఒకే తల్లి బిడ్డలుగా మసలుకున్నప్పుడే దేశాభ్యున్నతి సాధ్యమని అన్నారు. దానికి సూచికగానే నేడు రక్షాబంధన్ జరుపుకుంటున్నామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో షుమారు 100మంది గిరిజన కార్యకర్తలు పాల్గొన్నారు.