News

ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం : సీఎం యోగి

173views

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే) మరో కొన్ని నెలల్లో భారత్‌లో విలీనమవుతుందని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ (Yogi Adityanath) అన్నారు. అయితే, నరేంద్ర మోదీ ప్రధానిగా ఉంటేనే అది సాధ్యమవుతుందని పేర్కొన్నారు. శనివారం పాల్ఘర్‌లో ఏర్పాటుచేసిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యోగి ప్రసంగించారు.

మూడేళ్లుగా పాకిస్థాన్‌లో అనేకమంది ఉగ్రవాదులు హతమయ్యారు. దానివెనక భారత ఏజెన్సీల హస్తం ఉన్నట్లు ఆంగ్ల పత్రిక కథనాలు పేర్కొంటున్నాయి. మన ప్రజలను చంపినవారిని మనం పూజించలేం కదా. తగిన బుద్ధి చెబుతాం. పీవోకేను ఆక్రమించుకునేందుకు పాకిస్థాన్‌ తీవ్రంగా యత్నిస్తోంది. కానీ, అలా జరగదు. మరో ఆరు నెలల్లో అది పూర్తిగా భారత్‌లో విలీనమవుతుంది. కానీ.. మూడోసారి కూడా మోదీయే ప్రధానిగా బాధ్యత వహిస్తేనే అది జరుగుతుంది’’ అని యోగి పేర్కొన్నారు.