News

రాజస్థాన్ లో హిందువుల ఊరేగింపుపై ముస్లిం మూక దాడి.

690views

రాజస్థాన్ రాజధాని జైపూర్ లో మరోసారి మత కలహాలు చెలరేగాయి. సంప్రదాయంగా ప్రతియేటా జరిగే కన్వర్ ల యాత్రపై ముస్లిం మూకలు జరిపిన రాళ్ల దాడిలో20మంది గాయపడగా ఒక ట్రక్, ఒక వ్యాన్ అల్లర్ల లో దహనమయ్యాయని తెలుస్తోంది. కాగా నివారణ చర్యలలో భాగంగా 10 స్టేషన్ ల పరిధిలో ఇంటర్నెట్ సేవలను 24గంటల పాటు నిలిపి వేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ ఆనంద్ శ్రీవాస్తవ తెలిపారు. సుభాష్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చార్ దర్వాజ వద్దగల శివాలయం సమీపంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. వెంటనే స్పందించిన పోలీసు దళాలు అక్కడ కు చేరుకుని పరిస్థితి ని అదుపు చేశాయి.

ప్రతి సంవత్సరం మాదిరిగా నే కన్వర్ ల ఊరేగింపు చార్ దర్వాజ సమీపంలో గల శివాలయానికి చేరిన సందర్భంలో భక్తులు శివస్తుతి, నినాదాలు చేస్తూ శివాలయంపై జండా ఎగురవేస్తున్న సందర్భంలో పెట్రేగిన అల్లరి మూకలు భక్తుల పై రాళ్లు విసరడమే కాక, పోలీసుల చేతిలో ని లాఠీలను సైతం లాక్కొని భక్తుల పై దాడి చేశారు. ఈ సంఘటన లో ఒకరికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. నగరమంతా పోలీసు బందోబస్తును కట్టుదిట్టం చేశారు.

ఆదివారం రాత్రి11గంటల సమయంలో జరిగిన మరొక సంఘటన లో గళ్తా గేట్ సమీపంలో హరిద్వార్ కు వెళ్తున్న యాత్రికుల బస్ పైన ఒక వర్గానికి చెందిన వారు రాళ్ళ దాడి చేశారు. ఆందోళనకారులు నినాదాలు చేస్తుండగా, మరొక వర్గం వారు కూడా అక్కడకు చేరుకుని ఆందోళన నిర్వహించారు. దానితో అక్కడకు చేరుకున్న పోలీసులు టియర్ గ్యాస్ ఉపయోగించి ఇరువర్గాల వారిని చెదరగొట్టారు. ఈ సంఘటన తో ట్రాఫిక్ జామ్ అయ్యింది. రాత్రి 2 గంటల ప్రాంతంలో పరిస్థితి అదుపులోకి వచ్చింది. నగరమంతటా అదనపు దళాలను మోహరించారు. 25-30 మంది పైన కేసులు నమోదు చేశామని, ఇంతవరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని కమిషనర్ శ్రీవాస్తవ తెలియచేశారు.