News

మారు మూలల్లో సైతం కేరళ సేవా భారతి మరపురాని సేవలు

261views

కేరళలో ఎడతెరిపి లేని వర్షాల కారణంగా జన జీవనం అస్తవ్యస్తమైపోయింది. నగరాల్లో సైతం నిత్యావసరాలు అందుబాటు లేక జనం అవస్థలు పడుతున్నారు. ఇక మారు మూల గ్రామాల సంగతైతే చెప్పనలవి కాదు. రోడ్లు తెగిపోయి, విద్యుత్, టెలిఫోన్ సౌకర్యం లేక మిగతా చోట్లకి రాకపోకలు పూర్తిగా బంద్ అయిపోయి ఎటూ పోలేని, ఏమీ చెయ్యలేని అగమ్య గోచర స్థితి వారిది.

అందునా ఇంతటి వరద భీభత్స పరిస్థితుల్లో ఉదృతంగా ఉండే భవానీ నదిని దాటి ఆవలి గ్రామాలలో సహాయ కార్యక్రమాలు నిర్వహించటం ప్రభుత్వ వర్గాలకు కూడా దాదాపు అసాధ్యం. అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. ఆరెస్సెస్ అనుబంధ సంస్థ సేవా భారతి కార్యకర్తలు.

46 మందితో కూడిన ఆరెస్సెస్, సేవా భారతి కార్యకర్తలు కేరళలోని భవానీ నది ఆవల ఉన్న అట్టప్పడి గ్రామంలోని 32 గిరిజన కుటుంబాలకు కావలసిన నిత్యావసర సరుకులను అత్యంత ప్రతికూల, కఠినతర పరిస్థితుల నడుమ కాలి నడకన తీసుకెళ్ళి అందించడం అందరినీ కదిలిస్తోంది. ఇక ఆ గిరిజన కుటుంబాల ఆనందమైతే వర్ణనాతీతం. “అత్యంత క్లిష్ట పరిస్థితులలో మాకు అండగా నిలిచారు. మీ ఋణం ఎలా తీర్చుకోగలం తమ్ముళ్ళూ” అంటూ ఆ గ్రామస్తులు కార్యకర్తల్ని ఆలింగనం చేసుకున్నారు.