News

మాల్దీవులను పూర్తిగా వీడిన భారత సైన్యం

264views

మాల్దీవుల నుంచి భారత సైన్యం పూర్తిగా వెనుదిరిగింది. తమ దేశంలో ఉన్న చివరి భారత సైనిక బృందం స్వదేశానికి పయనమైనట్లు మాల్దీవుల అధ్యక్ష ప్రతినిధి హీనా వాల్దీద్‌ శుక్రవారం వెల్లడించారు. మాల్దీవుల్లో మోహరించిన 89 మంది భారత సైనికులు మే 10వ తేదీ లోపు తమ దేశాన్ని వీడాలని చైనా అనుకూల నాయకుడిగా పేరుగాంచిన మహమ్మద్‌ ముయిజ్జు ఆదేశించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే గత సోమవారం 51 మంది సైన్యం భారత్‌కు తిరుగు పయనమవ్వగా, తాజాగా చివరి బృందం కూడా వెనక్కు వచ్చింది.