News

మత పరమైన కార్యక్రమాలలో రాజకీయాలా ? పాకిస్తానీలపై మండిపడ్డ బెహ్రయిన్

112views

కాశ్మీర్ ఎప్పటికీ భారత్ కు చెందినదే. దానిని దక్కించుకోవాలని పాకిస్థాన్ ఎంతగానో ప్రయత్నిస్తోంది. ఎన్నో కుటిల యత్నాలను కూడా చేస్తోంది. కానీ పాకిస్థాన్ ఆటలు భారత్ ముందు సాగడం లేదు. ఇక వివిధ దేశాల్లో ఉన్న పాకిస్థానీలు అయితే కాశ్మీర్ తమదే అంటూ ర్యాలీలు కూడా చేస్తున్నారు. అలా బెహ్రెయిన్ దేశంలో కూడా చేశారు. అయితే అది అక్కడి అధికారులకు ఏ మాత్రం నచ్చలేదు. భారత ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బెహ్రెయిన్‌లో సోమవారం నాడు బక్రీద్ ప్రార్థనల తర్వాత చట్ట విరుద్ధంగా ర్యాలీ నిర్వహించారు. అయితే దీనికి ఎటువంటి పర్మిషన్ లేదు.. అంతేకాకుండా ప్రార్థనల అనంతరం ఇలాంటివి చేయడాన్ని అక్కడ తీవ్రంగా పరిగణిస్తారు. దీంతో బెహ్రెయిన్ అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు. ‘‘చట్టాన్ని ఉల్లంఘించి ఈద్ ప్రార్థనల అనంతరం ర్యాలీ నిర్వహించిన ఆసియన్లపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటున్నాం’’ అని ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. మతపరమైన కార్యక్రమాలను రాజకీయాల కోసం వినియోగించుకోవద్దని పౌరులను కోరింది. ఇప్పటికే కొందరిని అదుపు లోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.