News

బక్రీదు సందర్భంగా హైదరాబాదులో పోగైన 2,251 టన్నుల జంతు వ్యర్ధాలు – భారీ ట్రక్కులతో తరలింపు

686views

క్రీద్‌ పర్వదినం సందర్భంగా సోమవారం నగరవ్యాప్తంగా 2,251 టన్నుల జంతు వ్యర్థాలు పోగయ్యాయి. ఒక్క చార్మినార్‌ జోన్‌ నుంచే 900 టన్నుల వ్యర్థాలను సేకరించామని జీహెచ్‌ఎంసీ తెలిపింది. మొత్తాన్ని 42 ప్రత్యేక వాహనాల్లో సమీపంలోని తరలింపు కేంద్రాలకు 90 ట్రిప్పుల్లో చేరవేశామని జోనల్‌ కమిషనర్‌ శ్రీనివాసరెడ్డి వివరించారు. ఇళ్లు, మసీదులు, ఈద్గాల వద్ద జంతు వధతో పోగైన వ్యర్థాల నిర్వహణ కోసం పౌరులకు ప్రత్యేకంగా నల్లని ప్లాస్టిక్‌ కవర్లను పంపిణీ చేశామన్నారు. తరలింపు కేంద్రాలకు చేరిన వ్యర్థాల్లో 1538 టన్నులను భారీ ట్రక్కుల సాయంతో జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డుకు పంపించినట్లు చెప్పారు. మంగళవారం ఉదయం కూడా కొంత మొత్తం జంతు వ్యర్థాలు చెత్తకుప్పల్లోకి చేరే అవకాశం ఉందని అధికారులు వివరించారు.

వ్యర్ధాలను తరలిస్తున్న జి హెచ్ ఎం సి వాహనం.