News

కుల్గాం జిల్లాలో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు ఉగ్రవాదుల హతం

301views

జమ్మూకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో మంగళవారం భద్రతా బలగాలకు ఉగ్రవాదులకు మధ్య భారీ ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. అయుతే మృతి చెందిన ఉగ్రవాదుల సమాచారం ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం కుల్గాంలోని రెడ్‌వానీ ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికల గురించి భద్రతా దళాలకు సమాచారం అందింది. దీంతో సోమవారం అర్థరాత్రి ఆ ప్రాంతంలో సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టారు. ఈ క్రమంలో భద్రతా బలగాలకు ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో భద్రతా బలగాలు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయని అధికారులు తెలిపారు. చొచ్రు గాలా ప్రాంతంలోని పనారా గ్రామంలో ఎన్‌కౌంటర్ చోటుచేసుకున్నట్లుగా వెల్లడించారు.