
200views
ఈనెల 10వ తేదీన సింహగిరిపై జరగనున్న చందనోత్సవం సందర్భంగా అప్పన్న స్వామి నిజరూప దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి కరికల్ వలవన్ సూచించారు. సోమవారం ఆయన సింహగిరిపై కలెక్టర్ మల్లికార్జున, జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్‌వర్మ, ఈవో సింగల శ్రీనివాసమూర్తితో ఏర్పాట్లపై సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి భక్తుడికి సులువుగా స్వామి నిజరూప దర్శనం లభించేలా చూడాలన్నారు. గతంలో జరిగిన పొరపాట్లను అధిగమిస్తూ ఆయా లోపాలను సవరించుకోవాలని ఆదేశించారు. అధికారులు ఇప్పటికే చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. తొలుత ఆయన అప్పన్న స్వామిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు.





