News

ఖమ్మంలో సామాజిక సమరసతా వేదిక రెండు రోజుల అధ్యయన వర్గ.

72views

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సమరసతా అధ్యయన వర్గ ఆగష్టు 10, 11 తేదీలలో ఖమ్మంలో జరిగింది. ఈ వర్గలో వివిధ యూనివర్సిటీ, కళాశాలల అధ్యాపకులు, రీసెర్చ్ స్కాలర్లు, రచయితలు, అనువాదకులు, వక్తలు, జానపద కళా రూపకాల రచయితలు ఇలా మొత్తం 150 మంది పాల్గొన్నారు. ఆరెస్సెస్ అఖిల భారతీయ సంపర్క ప్రముఖ్ డాక్టర్ అనిరుధ్ దేశపాండే, సామాజిక సమరసతా వేదిక జాతీయ కన్వీనర్ కె. శ్యాం ప్రసాద్, కో కన్వీనర్ రవీంద్ర కిర్కొలే, ఆరెస్సెస్ క్షేత్ర ప్రచారక్ శ్యాం కుమార్, డాక్టర్ వడ్డి విజయసారథిలు పాల్గొని వర్గలో పాల్గొన్నవారికి మార్గ దర్శనం చేశారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ మొట్ట మొదటి న్యాయ మరియు కార్మిక శాఖా మంత్రి “జోగేంద్రనాథ్ మండల్ యొక్క రాజీనామా లేఖ” , శ్రీ దత్తోపంత్ ఠేంగ్డే రచన “సమరసత నినాదం కాదు, నిబద్ధత” అనే రెండు పుస్తకాలను ఈ సందర్భంగా ఆవిష్కరించారు.